ఆలయ చిరునామా :
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, 23-23-37A. శివరావు స్ట్రీట్ ,
సత్యనారాయణపురం ,విజయవాడ -520011.
ఫోన్ – 0866 2536688.

“గం. గణపతయే నమః. దూర్వాయుగ్మమ్ సమర్పయామి ..”

శ్రీ ఆకెళ్ళ విజయ భాస్కర శాస్త్రి గారు 15.07.1944 లో జన్మించారు. పుట్టినది తణుకు, (పశ్చిమగోదావరి జిల్లా). స్వగ్రామం పాశర్లపూడి, బాడవ. తండ్రిగారిపేరు సత్యనారాయణ, తల్లిగారు పురుషోత్తం గారు(చిట్టెమ్మ). ప్రస్తుతం విజయవాడ వాస్తవ్యులు. టెలికాం డిపార్ట్మెంట్ లో సీనియర్ సూపర్వైజర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. వారి 25 వ ఏట వివాహం జరిగింది. 29 వ ఏట వారి ఇంట శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు వెలిశారు. స్వయం భూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తగురీతిలో సేవ చేసుకోలేకపోతున్నాఅన్న ఆలోచనతో వారు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, కాంచీపురం కామకోటి పీఠాదీశ్వర్లు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారి దివ్య ఆశీష్షులతో, సొంత ఖర్చులతో మరియు, కొంత మంది భక్తుల సహకారంతో స్వామి వారికీ ఆలయాన్ని నిర్మించి పూర్తిగా స్వామి సేవ కే అంకితమయ్యారు . వారికి ఒక కుమార్తె. స్వామి అనుగ్రహంతో కుమార్తె వివాహం జరిపించి.. ఏ ఇతర ఈతి బాధలు లేకుండా , స్వామి సేవ లో కాలం వెళ్లదీస్తున్నారు. వారు తన తదనంతరం తన యావదాస్తి శ్రీ వల్లి దేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్య మందిరం అనే పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ చెందేలా ఏర్పాట్లు చేసారు. వారికి గురువు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారే, మంత్రోపదేశం కూడా శ్రీ స్వామీ వారే స్వయంగా చేసారాని తెలియవస్తోంది.
ఆయన నుండి ఉపదేశం పొంది తద్వారా వివేకవంతుడైన ఒక విద్యార్థి ఉదంతం తెలియవచ్చింది.. అది అందరికి తెలియచేయాలన్న ఆలోచనతో ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ఒక పిల్లవాడు 10 వ తరగతి 7సార్లు తప్పాడు. ఈ స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చి, ఇంట్లో అందరూ తిడుతున్నారు,నాకుబతకాలనిలేదు, చనిపోతానని ఏడ్చాడు. అప్పుడు శాస్త్రి గారు ఆ పిల్లవానిని ఓదార్చి గణపతి యొక్క అనుగ్రహము గురించి చెప్పి గణాష్టకము చదివించటం జరిగింది.దాని ఫలితముగా ఆపిల్లవాడు ప్రతీసంవత్సరము ఉత్తీర్ణుడగుచు PG కూడా చేసాడు.
విద్యార్థులు క్రమం తప్పకుండా ఈ గణాష్టకం పఠించిన పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించగలరు.
ఈ గణాష్టకం పెద్దలు చదవటం వలన తలపెట్టిన కార్యములన్ని నిర్విఘ్నముగా జరుగును. దేనికైనా భక్తి, శ్రధ్ధ ఇంకా నమ్మకమే ముఖ్యం.

 

Scroll to Top