శ్రీమతి ఆకెళ్ల సుబ్బలక్షి గారు ఫిబ్రవరి 10, 1957 తేదీ జయంతి వెంకట కృష్ణయ్య, రామలక్ష్మి దంపతులకు మూడవ సంతానంగా రాజోలు తాలూకా పెదపట్నం గ్రామం లో జన్మించారు. పదవ తరగతి వరకూ చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1974 లో ఇరుసుమండ వాస్తవ్యులైన శ్రీ ఆకెళ్ల సత్యనారాయణ మూర్తి గారితో వివాహం జరిగింది. వారు తండ్రిగారయిన రామసోమయజులు గారిని చూసుకుంటూ ఇరుసుమండ గ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం చేసేవారు.

వారిరువురికి ఇద్దరు సంతానం కలిగారు. పాప పేరు లక్ష్మీ కామేశ్వరి, బాబు పేరు రామసోమయజులు. వివాహానంతరం కూడా శ్రీమతి సుబ్బలక్ష్మి గారు చదువు పట్ల ఆసక్తితో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు, బి.కామ్ మొదటి సంవత్సరం వరకు చదువుకున్నారు.

1987 అక్టోబర్ లో అకస్మాత్తుగా వారి భర్త సత్యనారాయణ మూర్తి గారు స్వర్గస్థులవడం చేత పిల్లలు మరియు ఇంటి బాధ్యత ఆవిడ మీద పడింది. వారి భర్త పనిచేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఉద్యోగం ఆవిడకు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించి పెద్దచేశారు. వారి కుమార్తెకి 1997లో వివాహం చేసారు. వారి అబ్బాయి రామసోమయాజులు ని C.A చదివించి 2009 లో వివాహం చేశారు.

పరిస్థితులకు భయపడకుండా ధైర్యంతో ఎదుర్కొని పిల్లల్ని చదివించి ప్రయోజకులని చేసి, పెళ్ళిళ్ళు చేసారు. ఇప్పటికీ పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు.

తీర్థయాత్రలలో, దైవకార్యాలలోనూ పాల్గొంటూ, వీలయినంత వరకూ ఇతరులకు సహాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

Scroll to Top