బేటి పఢావ్ – బేటి బచావ్

భారత ప్రభుత్వం మరియు మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పధకం..

ఇంత మంచి పధకం కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల ఆశించిన ప్రయోజనాలను అందుకోలేకపోతోంది..

భారత దేశ జనాభా దాదాపు 135 కోట్లు, అందులో మహిళల శాతం 48% అంటే దాదాపుగా 63 కోట్లు.. ఒక అంచనా ప్రకారం 10 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు వాళ్ళ సంఖ్య దాదాపు 45 కోట్లు..

సేనిటరి నేప్కిన్స్ వాడకం అర్బన్ మహిళల్లో దాదాపుగా 70% మరియు రూరల్ మహిళల్లో దాదాపుగా 47% శాతంగాను ఉంది.. ఆలిండియా ఏవరేజ్ 57% గాను ఉంది..

అంటే దాదాపు 43% శాతం మహిళలు శానిటరి నేప్కిన్స్ వాడటం లేదు..అంటే అటువంటి వారి సంఖ్య రమారమి 18 కోట్లు.

ఈ 43 శాతం మంది మహిళలు లేదా ఆడ పిల్లలు ఋతు కాలంలో అత్యంత అపరిశుభ్రమైన పాత గుడ్డలు , రంపం పొట్టు లేదా బూడిద వాడుతున్నారు.. దీని వలన గర్భాశయానికి సంబంధించిన రోగాలు మరియు అనేక ఇతర రోగాలు ప్రబలుతున్నాయి..చాలామందిలో గర్భాశయాన్ని తొలగించవలసి కూడా వస్తోంది.. మరెంతో మంది మ్రృత్యువాత పడుతున్నారు కూడా…

ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది దీనివల్ల స్కూల్లో చదువుకునే ఆడ పిల్లల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి..

అలాంటి ఆడబిడ్డలకు మన వంతు సహాయంగా ఆకెళ్ల ఫౌండేషన్ తరపునుండి తొలుతగా ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉచితంగా సేనిటరి నేప్కిన్స్ పంపిణీ చేయాలనే తలంపుతో 13-02-2020 నాడు స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ నరేందర్ గారిని ముషీరాబాద్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ శామ్యూల్ రాజ్ గారిని మరియు స్కూల్ టీచర్లు శ్రీమతి జి మీనాకుమారి శ్రీమతి బి శాంతిజ్యోతి శ్రీమతి సునీత గార్లను కలిసి వారికి ఈ ప్రతిపాదన తెలియచేయగా వారు ఆమోదించడం జరిగింది..

ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొత్తం 310 బాలికలు చదువుతున్నారు.. క్లాసుల వారీగా వాళ్ళ వివరాలు.

6 th Class – 59
7 th class – 65
8 th class – 77
9 th class – 70
10 th class – 39

వీరంతా కూడా పేద లేక దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే..

అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ నరేందర్ గారు స్కూలుకు సంబంధించిన మరికొన్ని ఇబ్బందులు కూడా తెలియచేయడం జరిగింది..
అందులో ముఖ్యంగా పిల్లలకు సరైన తాగునీటి సౌకర్యం లేదు..

క్లాస్ రూములలో సరైన వెంటిలేషన్ సౌకర్యాలు లేక దాదాపుగా 100 మంది పిల్లలు కంటి జబ్బుల బారిన పడ్డారు.. క్లాస్ రూములకు వైట్ వాష్ చేయిస్తే ఈ ఇబ్బంది కొంతమేరకు తగ్గుతుంది.

టాయిలెట్స్ డోర్లు విరిగిపోయాయి.. అలాగే వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదు..అందువల్ల పరిశుభ్రత అస్సలు లేదు..

హెడ్ మాస్టర్ శ్రీ నరేందర్ గారు ఒకవేళ మనం ఈ స్కూలుని దత్తత తీసుకోదలచిన పది లక్షల రూపాయలు ప్రభుత్వానికి నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టాల్సి వస్తుందని తెలియచేసారు..

ప్రస్తుతం ఆ స్కూలులో 26 మంది టీచింగ్ స్టాఫ్ మరియు 2 నాన్ టీచింగ్ స్టాప్ ఉన్నారు..

Scroll to Top